Header Banner

అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ పై బిగ్ అప్డేట్! కలిసొచ్చేదెవరికి..!

  Thu May 22, 2025 22:06        Politics

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అయింది. వచ్చే ఎన్నికల్లోనూ పొత్తు కొనసాగాలని కూటమి పార్టీలు ఆశిస్తున్నాయి. అటు కూటమి పైన ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని.. తమకు కలిసి వస్తుందని జగన్ లెక్కలు వేస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశం మరో సారి తెర మీదకు వచ్చింది. సెన్సెస్ పై కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో.. ఇప్పుడు అసెంబ్లీ సీట్ల పెంపు ఖాయమని భావిస్తున్నారు. ఇదే సమ యంలో టీడీపీ సీనియర్ నేత అసెంబ్లీ సీట్ల పెంపు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

పునర్విభజన చట్టం
ఏపీ పునర్విభజన చట్టం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలు పెంచాల్సి ఉంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 స్థానాల సంఖ్య 225, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచేలా చట్టం చేసారు. అయితే, ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇప్పుడు కేంద్రం సెన్సెస్ తో పాటుగా కుల గణన చేయాలని నిర్ణయించింది. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తేవాల్సి ఉంది. దీంతో, 2029 నాటికి అసెంబ్లీ సీట్ల పెంపు ఖాయమని భావిస్తున్నారు. సీట్లు త్యాగం చేసి.. నామినేటెడ్ పదవులు దక్కని నేతలకు కూటమి పార్టీల నేతలు అసెంబ్లీ సీట్ల పెంపు.. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు పైన హామీలు ఇస్తున్నారు. దీంతో..సీట్ల పెంపు పైన అంచనాలు పెరుగుతున్నాయి.

225 సీట్లకు పెంపు
ఏపీలో 2009 లో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో డీ లిమిటేషన్ జరిగింది. దీంతో, 2009 లో ప్రజారాజ్యం ఎంట్రీ తో పాటుగా ఈ డీలిమిటేషన్ కారణంగా నాటి ఎన్నికల ఫలితాలు మొత్తం గా ఆసక్తి గా మారాయి. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చి వైఎస్సార్ రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు తిరిగి 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు సీట్ల కేటాయింపుతో పాటుగా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయని భావించారు. కాగా, కూటమిగానే మూడు పార్టీలు తిరిగి పోటీ చేస్తే సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో కలిసి వస్తుందనే లెక్కలు వేసారు. పార్లమెంట్ సీట్ల పైన చర్చ జరుగుతుండటంతో.. మరింత ఆసక్తి పెరిగింది.

యనమల క్లారిటీ
డీలిమిటేషన్ ప్రక్రియ సహజంగా అధికారంలో ఉండే పార్టీకి కలిసి వస్తుందని.. ప్రతిపక్ష పార్టీలను దెబ్బ తీయటానికి మేలు చేస్తుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే, ఇదే సమయంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. 2029 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారు. మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ 2029 తరువాతనే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. ఆర్దిక, శాసన వ్యవహారాల్లో అనుభవం ఉన్న యనమల చెప్పటంతో ఇక వచ్చే ఎన్నికల నాటికి సీట్ల పెంపు అవకాశం లేదనే కూటమి నేతలు భావిస్తున్నారు. కూటమి కొనసాగి.. యనమల చెప్పినట్లు సీట్లు పెరగకపోతే సమస్యలు తప్పవనే వాదన ఉంది. దీంతో, అసలు డీలిమిటేషన్ పైన అధికారిక నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #delematation #assembly #big #update #politics